9 Feb 2012

లోహాలు - స్థితి మార్పు

లోహాలు - స్థితి మార్పు


  • 06/02/2012
పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలతో బాటు ప్లాస్మా అనే మరో రూపంలోకూడా ఉంటాయి. వేడి కారణంగా పదార్థాలు ఒక రూపం నుంచి మరో స్థితికి మారుతుంటాయి. ప్లాస్మాస్థితి వాయు రూపం తరువాత వస్తుంది. ఈ స్థితిలో పదార్థం అణువుల నుంచి, వెలుపలి వరుసల్లో ఉన్న ఎలక్ట్రానులు విడిపోతాయి. అంటే పదార్థంలో ధనావేశం (పాజిటివ్ ఛార్జ్)గల అయానులతో బాటు నెగెటివ్ ఎలక్ట్రానులు కూడా ఉంటాయి. సూర్యునితోబాటు, అన్ని నక్షత్రాలలోనూ పదార్థం ఈ ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది. మనం చాలా గట్టిది అనుకునే ఇనుము కూడా అక్కడ ప్లాస్మా స్థితిలోనే ఉంటుంది.
మనకు తెలిసిన ఇనుము సాధారణంగా ఘన పదార్థం. దాన్ని రెండు వేల ఎనిమిదివందల ఫారెన్ హిట్‌వరకు వేడి చేస్తే అరి కరుగుతుంది. 5,182 డిగ్రీలవరకు వేడి చేస్తే అది మరుగుతుంది. ఇనుమును వాయు రూపంలో చూడాలంటే, ఇంతగా వేడి చేయాలన్నమాట. ఇంకా ఎక్కువ వేడి చేస్తే, ఇనుము ఆవిరి, ప్లాస్మాగా మారడం మొదలవుతుంది. సూర్యుని ఉపరితలంలో ఉండే సుమారు పదివేల డిగ్రీల వేడి దగ్గర, ఇనుము అణువులలోనుంచి వెలుపలి 26 ఎలెక్ట్రానులు మాత్రమే విడిపోతాయి. సూర్యగోళంలోని కరోనాలో వేడిమి 27 మిలియన్ డిగ్రీలు ఉంటుంది. అక్కడ ఇనుము అణువుల నుంచి ఆరు లేదా ఏడు ఎలెక్ట్రానులు మాత్రమే విడిపోతాయని కనుగొన్నారు. కొన్ని రకాల గ్రహాలలో వేడిమి మరీ ఎక్కువగా ఉండి, అక్కడ ఇనుము కరిగి ద్రవ రూపంలో ఉండే అవకాశం ఉందంటున్నారు.

No comments: